శంకర్ ను నమ్మడం వృధా.. చరణ్ మరో నిర్ణయం!


RRR సినిమాతో మంచి విజయం అందుకున్న రాంచరణ్ ఆ తర్వాత వెంటనే ఆచార్యతో మరో డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ సినిమాతో అయినా మళ్ళీ ట్రాక్లోకి రావాలి అనుకుంటూ ఉంటే ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. మరోవైపు లైకా ప్రొడక్షన్స్ మంచి ఒత్తిడి పెరగడంతో శంకర్ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాను రీస్టార్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈ తరుణంలో రామ్ చరణ్ మరికొన్ని రోజులు వెయిట్ చేయమని శంకర్ కూడా చెప్పాడట. ఎందుకంటే సాధారణంగా శంకర్ ఏ హీరోతో వర్క్ చేసినా కూడా తన ప్రాజెక్ట్ పూర్తయ్య వరకు ఆ హీరో మరొక సినిమా చేయడానికి వీలు లేదు అని అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇక చరణ్ సినిమా విషయంలో శంకర్ పరిస్థితుల కారణంగా బ్రేక్ ఇవ్వడం వలన ఇప్పుడు అగ్రిమెంట్ వ్యాల్యూ లేనట్లే లెక్క. దీంతో అతని నమ్ముకునే బదులు గౌతమ్ తిన్ననూరి  ప్రాజెక్టుపై చర్చలు జరపాలి అని అలాగే మరో ఇద్దరు దర్శకులు వద్ద నుంచి కూడా కథలు వినాలని అనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ దర్శకుడు కూడా రామ్ చరణ్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. సుకుమార్ తో కూడా చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది.

Post a Comment

Previous Post Next Post