మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ లతో చాలా బిజీగా మారిపోయాడు. గాడ్ ఫాదర్ తుది దశలో ఉండగా రీసెంట్ గా వాల్తేరు వీరయ్య ప్రాజెక్ట్ మొదలయింది. ఇక అంతకుముందే బోలా శంకర్ సినిమా కూడా మొదలైంది కానీ ఆ ప్రాజెక్టు ఎంతవరకు ఫినిష్ అయిందన్న విషయంలో ఇంతవరకు అప్డేట్ అయితే ఇవ్వలేదు.
ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్టులన్నిటిపై కూడా మెగా స్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22వ తేదీన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోవచ్చు అని టాక్ కూడా వచ్చింది. కానీ దర్శకుడు మాత్రం ఆ ప్రాజెక్టు ఉంటుంది అని చెప్పాడు. ఇక ఆ ప్రాజెక్టు గురించి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow
Post a Comment