అగ్ర హీరోలతో పోటీగా మంచు విష్ణు


టాలీవుడ్ నటుడు విష్ణు మంచు జిన్నా సినిమాతో సక్సెస్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు.  ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పాయల్ రాజ్‌పుత్ సన్నీ లియోన్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో ఇప్పటివరకు ఆఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు.

అయితే విష్ణు ఇన్ డైరెక్ట్ గా ట్విట్టర్‌లోకి వెళ్లి అక్టోబర్ 5,  సినిమా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. ఇక అదే సమయంలో చిరంజీవి గాడ్‌ఫాదర్ మరియు నాగార్జున యొక్క ది ఘోస్ట్‌తో బాక్సాఫీస్ వద్ద  పోటీకి సిద్ధమయ్యాయి. మరి ఈ పోటీలో విష్ణు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post