ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలను తీసుకురావాలి అని ఓవర్గం నిర్మాతలు బాగానే ఆలోచిస్తున్నారు. కానీ కంటెంట్ తెరపైకి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. రీసెంట్గా ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి అనే నిర్మాత సినిమాలు బాగానే నిర్మిస్తున్నారు కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ మాత్రం అందుకోవడం లేదు.
ఇదివరకే ఆయన నిర్మించిన పడి పడి లేచే మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు, విరాటపర్వం సినిమాలు తీవ్ర నష్టాలను కలుగజేసాయి. ఇక అంతకుమించి అనేలా రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా గట్టిగానే దెబ్బ కొట్టింది. ఈ క్రమంలో నిర్మాతకు రవితేజ అండగా నిలిచినట్లు సమాచారం మరొక సినిమా చేసి పెద్దగా రెమ్యునరేషన్ తీసుకోకుండా నష్టపోయిన బయ్యర్లకు తక్కువ రేట్లకు సినిమాను ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా రవితేజ పెద్దగా లాభం చేకూర్చలేదు. ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ తీసుకోకుండా తన బ్యానర్ ను కూడా అందులో విలీనం చేశాడు. ఇక సినిమా నష్టపోవడంతో రవితేజకు కూడా పెద్దగా ఏమీ ప్రాఫిట్ రాలేదు అయినప్పటికీ కూడా నిర్మాతకు అతను అండగా నిలబదెందుకు ఒప్పుకున్నాడు అంటే మంచి విషయం అనే చెప్పాలి.
Follow
Post a Comment