లైగర్.. మైక్ టైసన్ కు ఎంత ఇచ్చారు?


లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ ఒక తెలుగు హీరో సినిమాలో కనిపిస్తున్నాడు అనగానే బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోయారు. లైగర్ సినిమాలో అతను చేసిన పాత్ర అద్భుతంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతటి ఆజానుబాహుడిని తీసుకువచ్చి పూరి జగన్నాథం క్రియేట్ చేసిన క్యారెక్టర్ చాలా కామెడీగా ఉంది అని కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇక అంతటి స్టార్ కోసం టైగర్ టీం అయితే చాలా ఎక్కువగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. మైక్ టైసన్ అయితే ఎక్కువగా డేట్స్ ఏమి ఇవ్వలేదట. కేవలం ఒక రోజుల్లోనే ఆయనకు సంబంధించిన సీన్స్ అన్నీ కూడా ఫినిష్ చేసినట్లు అనిపించింది. ఇక పారితోషికం అయితే గట్టిగానే ఇచ్చినట్లు టాక్ వస్తోంది. దాదాపు 15 కోట్ల వరకు అందినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ మాత్రం ముందుగా ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదట. సక్సెస్ అయిన తర్వాతనే మాట్లాడుకుందాం అని ఒక మంచి డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సినిమా టాక్ ను బట్టి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. మరి లాభాల్లో ఏమైనా వాటా ఇస్తారు లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post