నాగచైతన్య.. పాన్ ఇండియా సక్సెస్ వచ్చినా లాభం ఉండదేమో?


నాగచైతన్య పరిస్థితి నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా మారిపోయింది అతను సక్సెస్ అందుకుంటే ఏదో ఒక కాంబినేషన్ సెట్ అయ్యిందని వంకలు చూపిస్తున్నారు. అలాగే డిజాస్టర్ అయితే మాత్రం సోలోగా అతను సక్సెస్ అందుకోవడం అసాధ్యమని కూడా చెబుతున్నారు. సక్సెస్ అయిన ఫ్లాప్ అయినా కూడా అతనికి పెద్దగా లాభం చేకూరే అవకాశం లేను అన్నట్లుగానే వాతావరణం క్రియేట్ అవుతుంది.

ఇక ప్రస్తుతం అతని ఆశలన్నీ కూడా లాల్ సింగ్ చద్దా సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో థాంక్యూ డిజాస్టర్ ను మర్చిపోయేలా చేయాలని అనుకుంటున్నాడు. ఒక విధంగా అమీర్ ఖాన్ అయితే నాగచైతన్య ద్వారానే ఈ సినిమాను తెలుగు లో భారీగా ప్రమోట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఇటీవల వచ్చిన థాంక్యూ సినిమా అతనికి ఊహించని దెబ్బ కొట్టింది. 

దీంతో అమీర్ ఖాన్ ప్రత్యేకంగా చిరంజీవితో ఎక్కువగా ప్రమోట్ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి అమీర్ ఖాన్ నాగచైతన్యను కాకుండా మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్న కూడా తెలుగులో బాగా ప్రమోట్ చేయించే వారేమో  ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా సక్సెస్ అయినా కూడా అమీర్ ఖాన్ వల్ల సక్సెస్ అయింది కానీ నాగచైతన్య ప్రభావం ఏమీ లేదు అనవచ్చు కూడా.

ఇక ఫ్లాప్ అయితే మాత్రం ఎలాంటి కామెంట్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలా చూసుకున్నా కూడా నాగచైతన్య దీన్ని తన కెరీర్ కు సంబంధించిన ఇంపార్టెంట్ సినిమాగా చూసుకోకూడదు. వీలైనంతవరకు అతను సోలోగా ఒక మంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకొని నిలదొక్కుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పవచ్చు.

Post a Comment

Previous Post Next Post