మళ్ళీ డబ్బింగ్ సినిమానే హిట్టు


తెలుగు చిత్ర పరిశ్రమలో మళ్లీ వరుస డిజాస్టర్ లు నమోదవుతున్నాయి. అగ్ర హీరోలు చిన్న హీరోలు టాలెంటెడ్ దర్శకులు ఎవరైనా సరే సరికొత్త కంటెంట్ తో రాకపోతే ప్రేక్షకులు ఏమాత్రం థియేటర్లకు రావడం లేదు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో అయితే ఎక్కువగా డబ్బింగ్ సినిమాలే తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి.

RRR సినిమా సంచల విజయాన్ని అందుకున్న తర్వాత మహేష్ బాబు కూడా బాక్సాఫీస్ వద్దగా అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయాడు. కేజిఎఫ్ 2 తర్వాత విక్రమ్, మేజర్ సినిమాలు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. ఇక రీసెంట్గా సుదీప్ కిచ్చా నటించిన విక్రాంత్ రోణా సినిమా మంచి లాభాలను అందించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మొదటి మూడు రోజుల్లోనే పూర్తిచేసుకుని ప్రస్తుతం ఆరు కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వరుసగా మరొక డబ్బింగ్ సినిమా సక్సెస్ కావడంతో తెలుగు సినిమాలను నమ్ముకోవడం కంటే డబ్బింగ్ సినిమాలతో బిజినెస్ చేసుకోవడం బెటర్ అని ఓవర్గం బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఆలోచిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post