బాలీవుడ్ లో విజయ్ మరో రెండు ప్రాజెక్టులు?


కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను లైగర్ సినిమాతో బాలీవుడ్ జనాలకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాడు.   బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ మీడియాలో విజయ్ చాలా హైలైట్ అయ్యే విధంగా ప్రమోషన్స్‌ని డిజైన్ చేసిన కరణ్ జోహార్ బాగానే సక్సెస్ అవుతున్నాడు.

ముఖ్యంగా మాస్ జనాలు విజయ్ ప్రసంగాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక విజయ్ స్టార్ హోదా గురించి క్షుణ్ణంగా పరిశీలించిన కరణ్ విజయ్ కోసం బాలీవుడ్ లోనే మరో రెండు ప్రాజెక్ట్‌లను సెట్ చేసారని తెలుస్తోంది. లైగర్ విడుదలైన తర్వాత వాటిని ప్రకటిస్తారని టాక్. ఏదేమైనా విజయ్ తో పాటు లైగర్ హిట్ కావడం పూరి జగన్నాథ్ కు కూడా చాలా అవసరం. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుముంటుందో చూడాలి. లైగర్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటించగా రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించింది.

Post a Comment

Previous Post Next Post