కృష్ణంరాజుకి ఇష్టమైన ప్రదేశంలోనే సమాధి!


ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే సినీ ప్రముఖులు అందరూ కూడా మహనటుడికి ఘనంగా నివాళులర్పించారు. ఇక సోమవారం అంతిమయాత్ర అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఐదేళ్ల క్రితం కృష్ణంరాజు కొనుగోలు చేశారు. అక్కడే ఆయన నివసించేందుకు ప్రత్యేకంగా సింపుల్ గా ఇంటిని నిర్మించాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక అది పూర్తికాక ముందే అసువులు బాశారు. అక్కడే ఉండాలని అనుకున్న కృష్ణంరాజు కోరిక మేరకు అంత్యక్రియలను కూడా అదే ఫామ్ హౌస్ లో చేసి సమాధి నిర్మించాలని ప్రభాస్ కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు.

Post a Comment

Previous Post Next Post