మళ్ళీ ఆ దర్శకుడితోనే మాస్ రాజా


మాస్ మహారాజా రవితేజ ఇటీవలే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ఊహించని డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక తదుపరి ధమాకా సినిమా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రానుంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన బజ్ ఏమిటంటే, నటుడు త్వరలో సంపత్ నందితో చేతులు కలపబోతున్నాడు.

ఆ సినిమా కూడా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందట.  ఇప్పటికే వీరు బెంగాల్ టైగర్ సినిమా చేశారు. అదేమంత హిట్ కాలేదు. సంపత్ కాన్సెప్ట్ బాగానే సెలెక్ట్ చేసుకున్నా మేకింగ్ విధానంలో మాత్రం రొటీన్ గా ఉంటుందనే నెగిటివ్ టాక్ ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ మాస్ రాజా ఆడియెన్స్ కు నచ్చేలా మెటీరియలైజ్ అవుతుందో లేదో వేచి చూడాలి.  ధమాకా కాకుండా రవితేజ రావణాసురుడు, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటిస్తున్నాడు. మెగా154లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Post a Comment

Previous Post Next Post