Brahmastra - Movie Review


కథ:
శివ (రణబీర్ కపూర్) డీజే గా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇషా (ఆలియా భట్)ను చూడగానే ఇష్టపడిన రణ్ బీర్ ఆమెతో ప్రేమలో పడిన తరువాత నిప్పుతో అతనికి ఉన్న వింత అనుబంధం వెనుక అసలు కారణాన్ని కనుగొనాలని మరింతగా ఆలోచించాల్సి వస్తుంది. ఇక ఆ తరువాత బ్రహ్మ-శక్తిని ఉపయోగించుకునే ఋషుల రహస్య సమాజమైన బ్రహ్మాంశ నాయకుడు గురుజీ (అమితాబ్ బచ్చన్) దగ్గరకు శివ వెళ్లాల్సి వస్తుంది. ఇక  ఇంతలో దుష్ట శక్తుల మహా రాణి అయిన జునూన్ (మౌని రాయ్) విచ్ఛిన్నమైన బ్రహ్మాస్త్రకు సంబంధించిన ముక్కల తరహాలో ఉండే ఆధారాలను కనుగొని ఆమె దుష్ట ప్రణాళికలను బలంగా మార్చాలని అనుకుంటుంది. ఇక ఆ తరువాత హీరోకి బ్రహ్మాస్త్రకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ తరువాత వివిధ అస్త్రాలు ఏ విధంగా ఏకమవుతాయి? దుష్ట శక్తిని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథ!

విశ్లేషణ:
బ్రహ్మాస్త్ర సినిమా రెగ్యులర్ గా లవ్ స్టోరిలా స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తరువాత వెంటనే హీరో తన జీవితంలో చోటు చేసుకునే మర్మమైన శక్తులకు సమాధానం తెలుసుకునేందుకు తొందరగానే యూ టర్న్ తీసుకుంటాడు. మితిమీరిన క్లిష్టతరమైన స్క్రీన్‌ప్లేతో, బ్రహ్మాస్త్ర కొన్ని సమయాల్లో కొంచెం మెలికలు తిరుగుతుంది. అయితే చాలా త్వరగా తిరిగి ట్రాక్‌లోకి వస్తుంది. దాదాపు ఈ సినిమా కోసం ఎనిమిది సంవత్సరాల సమయం తీసుకున్న ఆయాన్ ముఖర్జీ కథ మేకింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ ఎమోషన్ మాత్రం బలంగా క్లిక్ అవ్వలేదు. 

సినిమాకు ఎంతో క్లిష్టమైన స్క్రీన్ ప్లే విషయంలో కూడా అతను పెద్దగా మెలికలు తిప్పలేదు అని అర్థమవుతుంది. చాలా సింపుల్ గానే కథ మొత్తం ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంటర్వెల్ లో తప్పితే ఆ తర్వాత పెద్దగా ఆసక్తిని కలిగించదు. చాలా సాఫీగానే దర్శకుడు ఈ సినిమా కథనం ముందుకు కొనసాగించాడు. ఎక్కువగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా మ్యాజిక్ క్రియేట్ చేసింది అయితే లేదు. ఎక్కడ ఎంత వాడాలో అంతే వాడారు కానీ అవి జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అనేది వారి ఊహలకి వదిలేయాలి. ఎందుకంటే గ్రాఫిక్స్ మాత్రం మరి హై రేంజ్ లో అయితే లేవు.

ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ తర్వాత కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు చూపించినవే మళ్ళీ మళ్ళీ రొటీన్ గానే అనిపిస్తాయి. దర్శకుడు కథనం విషయంలో మాత్రం ఇంకా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఇక నటీనటులలో రణ్ బీర్ కపూర్ శివ పాత్రలో తనవైన శైలిలో మెప్పించడం ఇక తర్వాత ఆలియా భట్ కూడా పర్వాలేదు అనిపించింది. ఇక లేడి ప్రతినాయకగా మౌని రాయి నటించిన విధానం కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. 

ఇక షారుక్ ఖాన్ స్పెషల్ గెస్ట్ రోల్ ఈ సినిమాల్లో ఏదో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనుకున్నారు కానీ అది కూడా అంత పెద్దగా ఏమి వర్కౌట్ కాలేదు. ఇక తన పాత్ర నిడివికి తగ్గట్టుగా అమితాబచ్చన్ మరోసారి సింపుల్ నటనతో మెప్పించారు. ఇక నాగార్జున క్యారెక్టర్ కూడా అంతగా హైలైట్ అయింది ఏమీ లేదు. ఏదేమైనా కూడా దర్శకుడు మాత్రం చాలా సింపుల్ గానే సినిమాను ముగించాడు. 

ముగింపులో సెకండ్ పార్ట్ పై ఎదురు చూసేంత అంచనాలు పెద్దగా పెంచలేదు. ఇక సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఒక రెండు పాటలు అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా పరవాలేదు. కెమెరా పనితనం కూడా బాగానే ఉంది. ఇక యాక్షన్ కు సంబంధించిన ఎలిమెంట్స్ లో గ్రాఫిక్స్ అంతగా కొత్తగా ఏమీ అనిపించవు. ఇక అక్కడక్కడా అనవసర సన్నివేశాలు కొన్ని ఎడిట్ లో లేపేస్తే మరో 10 నిమిషాల నిడివిని తగ్గించవచ్చు. ఇక మొత్తానికైతే బ్రహ్మాస్త్రం సినిమా పరవాలేదు అనే విధంగా ఉంది ఎక్కువగా అంచబలు పెట్టుకోకుండా పిల్లలతో ఫ్యామిలీతో కలిసి వెళితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు

ప్లస్ పాయింట్స్:
👉హీరో క్యారెక్టర్
👉స్టోరీ
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
👉స్క్రీన్ ప్లే
👉ఏడిటింగ్

రేటింగ్: 2.5/5

Post a Comment

Previous Post Next Post