డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో మొత్తానికి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా అతని కెరీర్ లోనే అతి దారుణమైన ఫలితాన్ని అందించింది. మరోవైపు హీరో విజయ్ దేవరకొండ కెరీర్ పై కూడా కొంత ప్రభావం చూపిస్తోంది. అయితే పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఏ హీరో తో సినిమా చేస్తాడు అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ మారుతుంది.
పూరి అయితే అంత ఈజీగా వెనక్కి తగ్గడు కాబట్టి నెక్స్ట్ ఎలాగో మరొక సినిమాను త్వరగా తీసుకురావాలి అని అనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఉన్న ఏకైక ఆప్షన్ అతని కొడుకు. తనయుడు ఆకాష్ పూరి కూడా ఇప్పటివరకు సరైన విజయాన్ని అందుకోలేదు. కానీ అతన్ని కరెక్టుగా ప్రజెంట్ చేస్తే మాత్రం మంచి హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయి. ఇక శర్వానంద్ కూడా ఎప్పటినుంచో పూరితో కలవాలని అనుకుంటున్నాడు. మరి ఇదే అవకాశం అనుకోని డైరెక్టర్ పూరి అతన్ని సెలెక్ట్ చేసుకుంటాడో లేదో చూడాలి.
Follow
Post a Comment