లైగర్ పెట్టుబడులపై డౌట్స్.. ఈడీ ఆఫీసులో పూరీ, ఛార్మి

 


టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల లైగర్ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సహనిర్మాతగా సీనియర్ హీరోయిన్ చార్మి వ్యవహరించరు. అయితే ఈ సినిమాలో పెట్టుబడులపై ఈడి విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఈడి ఆఫీసులో పూరి జగన్నాథ్ ఛార్మి ఇద్దరినీ కూడా ED అధికారులు పలు ప్రశ్నల పై విచారణ జరిపినట్లు సమాచారం.


ఎందుకంటే ఈ సినిమాలో ప్రముఖ రాజకీయ నేతలు కూడా పెట్టుబడి పెట్టినట్లుగా కొన్ని అనుమానాలు రావడంతో వారిని ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి విచారణ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అసలే సినిమా డిజాస్టర్ కారణంగా పూరి జగన్నాథ్ కొంత టెన్షన్ లో ఉండగా ఇప్పుడు ఈడీ కి సంబంధించిన విచారణతో ఆయన మరింత చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ విషయంపై ఎలాంటి వివరాలు బయటకు వస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post