తెలుగు డైరెక్టర్ ను రిజెక్ట్ చేసిన భాయ్?


ఇటీవల కాలంలో భాషతో సంబంధం లేకుండా అగ్ర హీరోలు పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కూడా ఇప్పుడు అదే తరహాలో ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా అతను తెలుగు దర్శకులకు కూడా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ సెట్ కాలేదు.


అయితే రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ కు ఛాన్స్ ఇచ్చాడు. మంచి కథ దర్శకుడు సెట్ అయితే డేట్స్ ఇస్తాను అని చెప్పడంతో మైత్రి మూవీ మేకర్స్ చాలామంది దర్శకులతో చర్చలు జరిపింది. ఇక ఫైనల్ గా ఇప్పుడున్న మాస్ కమర్షియల్ దర్శకులలో హరీష్ శంకర్ అయితే బెటర్ అనుకున్నారు. ఎలాగూ పవన్ కళ్యాణ్ భవదియుడు భగత్ సింగ్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి హరిష్, సల్మాన్ ఖాన్ ను కలపాలని అనుకున్నారు. కానీ ఇప్పటికే రెండుసార్లు కథలపై చర్చలు జరిపినప్పటికీ భాయ్ ఒప్పుకోలేదని అతని కథను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరి హరీష్ శంకర్ మరొ కథతో అతనిని మెప్పిస్తాడా లేదంటే మరొక హీరోని వెతుక్కుంటాడా లేదా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post