తండ్రి చరిత్ర.. భారీ ఖర్చుతో మహేష్ ప్లాన్

 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో వరుస విషాదాలతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇక ఎంతో స్ఫూర్తిగా నిలిచిన తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను కోల్పోవడం కూడా మహేష్ బాబుకు తీరని లోటు. అయితే మహేష్ బాబు తన తండ్రి గర్వపడే విధంగా చేసి మంచి హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు అందుకున్నాడు. ఇక చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ పేరు మిగిలిపోయే విధంగా మహేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది.


మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ పేరుతో ఒక ప్రత్యేకమైన మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడట. సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ బిల్డింగ్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ బిల్డింగ్ లో ప్రత్యేకంగా సూపర్ స్టార్ కృష్ణ అవార్డులు ప్రత్యేకమైన సినిమా పోస్టర్లు అలాగే ఎవరు చూడని ఫోటోలు అంతేకాకుండా కృష్ణకు ఇష్టమైన వివిధ రకాల వస్తువులను ఆ మెమోరియల్ బిల్డింగ్ లో అందరూ చూసే విధంగా ఏర్పాటు చేయబోతున్నారట. అందుకోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేయాలని కుటుంబ సభ్యులు ఫిక్స్ అయ్యారట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post