లవ్ టుడే - రివ్యూ & రేటింగ్

 


కథ:
ప్రదీప్ ఉత్తమన్ (ప్రదీప్ రంగనాథన్‌) - నిఖిత (ఇవానా) ప్రేమలో మునుగితేలిన అనంతరం బెస్ట్ పాట్నర్స్ గా ఫీల్ అవుతారు. పెళ్లికి సిద్ధమైన తరుణంలో ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని అనుకుంటారు. ఇక హీరోయిన్ నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్య రాజ్) ని ఒప్పించాలని అనుకుంటే ఆయన వారి గురించి ఆలోచించి ఓ కండీషన్ పెడతాడు. ఇద్దరు కూడా వారి ఫోన్‌లు మార్చుకుని ఒక రోజు ఉండాలని, ఆ తరువాత ఓకే అయితే పెళ్లికి అభ్యంతరం లేదని వేణు శాస్త్రి అంటాడు. ఇక ప్రదీప్, నిఖితలు అందుకు ఒప్పుకుంటారు. ఇక ఆ తరువాత ఫోన్ మార్చుకున్న ప్రదీప్, నిఖితలు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటారు? వారిలో వచ్చిన మార్పులు ఏంటి? ఆలోచనా విధానం ఎలా మారింది.. అనేది సినిమా అసలు కథ.


విశ్లేషణ:

లవ్ టుడే సినిమా అనే కథను ప్రదీప్ నేటితరం వారికి కనెక్ట్ అయ్యే విధంగా చాలా అర్థవంతంగా రాసుకున్నాడు. ఇక కథానాయకుడు పాత్రలో అతనే నటించడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ప్రతి పాయింట్ కూడా అతను నేటి తరానికి అర్థమయ్యే విధంగా చాలా క్లుప్తంగా వివరణ ఇచ్చాడు అని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ నికిత కూడా నేటి తరం అమ్మాయిల తరహాలో చాలా చక్కగా నటించింది. ఇక ఒక మనిషి తాలూకు జీవితం మొత్తం ఈ రోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ లోనే ఉంది అని అలాగే వారి స్వభావాలు అలవాట్లు అన్ని కూడా ఒక స్మార్ట్ ఫోన్ చెబుతుంది అనే పాయింట్ ను దర్శకుడు చాలా చక్కగా హైలైట్ చేశాడు.

పెద్దగా బోర్ కొట్టించకుండా ప్రతి ఎపిసోడ్లోనూ ఏదో ఒక సన్నివేశాన్ని రియాలిటీ కి దగ్గరగా ఉండేలా చూసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ లో ప్రేమ కామెడీ సన్నివేశాలు ఇక తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా ఫన్ ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగుతుంది. ఇక సత్యరాజ్ కూడా నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. లవ్ టుడే సినిమా కథలో కేవలం ఒక తప్పును మాత్రమే కాకుండా దానికి సంబంధించిన పరిణామాలను చూపించిన విధానం మాత్రం ఒక వైపు నవ్విస్తూనే మరొకవైపు ఆలోచింపజేస్తుంది.

ఇక ఈ సినిమాలో యోగి బాబు ఈసారి కేవలం కామెడీ బాధ్యత మాత్రమే కాకుండా పలు ఎమోషనల్ కంటెంట్ సీన్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. అతను రియాలిటీ సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించగలడు అని నిరూపించుకున్నాడు. మధ్య మధ్యలో కొన్ని లవ్ సీన్స్ కాస్త అటు ఇటుగా నిరాశపరిచినప్పటికీ ఫైనల్ ఎపిసోడ్స్ వచ్చేవరకు జనాలకు ఇందులో మైనస్ పాయింట్స్ పెద్దగా గుర్తుకు రావు. ఆ విధంగా దర్శకుడు కథను ముందుకు కొనసాగించాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. 'ఒక విషయాన్ని చెప్పడం లేదు అంటే.. తప్పు చేశారు అని కాదు. మీరు తెలుసుకోకూడదు అని అర్థం' అని యోగి బాబు చెప్పిన డైలాగ్ తోనే ఒక సన్నివేశం చాలా బాగా హైలైట్ అయింది. అంతేకాకుండా ప్రేమించుకున్న వాళ్ళు చాలావరకు అప్పుడు విడిపోతున్నారు ఇప్పుడు విడిపోతున్నారు అని.. ఒకప్పుడు పెద్దవాళ్ల కారణంగా విడిపోతే ఇప్పుడు మీ కారణంగా మీరే విడిపోతున్నారు అని సత్యరాజ్ చెప్పిన డైలాగ్ కూడా ఆలోచింపజేస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తప్పితే మిగతా సినిమా మొత్తం అసలు కథకు తగ్గట్టుగా ముందుకు కొనసాగుతున్న విధానం కూడా బాగానే ఉంది. మరి తమిళ జనాలకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా తెలుగు జనాలకు ఎంతవరకు ఎక్కుతుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉కథ
👉కామెడీ
👉ఎమోషనల్ లవ్ సీన్స్

మైనస్ పాయింట్స్:
👉ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్: 3.25/5

Post a Comment

Previous Post Next Post