RRR 2.. మరీ అంత ఆశలు పెంచుకోకండి!

దర్శకదీరుడు రాజమౌళి RRR సినిమాకు సీక్వెల్ గా మరొక కథ పై చర్చలు జరుపుతున్నట్లుగా ఇటీవల అమెరికాలో క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ వార్తపై ఓ వర్గం అభిమానులు అయితే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇది మంచి వార్త అయినప్పటికీ కూడా రాజమౌళిని అంత ఈజీగా నమ్మలేము. ఇదివరకే బాహుబలి 3 కూడా రావచ్చేమో అని అన్నారు. అంతే కాకుండా ఈగ సీక్వెల్ పై కూడా అప్పటిలో ఒక కామెంట్ అయితే చేశారు.

ప్రస్తుతం ఉన్న హడావిడిలో రాజమౌళి RRR సీక్వెల్ ఉండవచ్చేమో అన్నారు కానీ బలంగా అయితే చెప్పలేదు. కానీ ఆయనకు ఆసక్తి ఉందో అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు అంటే దాని గురించి తప్పితే మరేవిషయం గురించి పెద్దగా ఆలోచించడు. ఇక మహేష్ బాబుతో సినిమా తరువాత ఎవరితో అనే విషయంలో కూడా రాజమౌళికి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇక RRR సీక్వెల్ అంటే మరో 10 ఏళ్ళ తరువాత ఉండొచ్చు లేదంటే ఆ లోపు అప్పుడు అనుకున్నాం సెట్టవ్వలేదు అనే కామెంట్ కూడా రావచ్చు. అందుకే ఈ సీక్వెల్ పై ఇప్పుడే మరి ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు అని ఓ వర్గం అభిమానులు కామెంట్ చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post