హరీష్ శంకర్.. లైనప్ పెద్దదే!


గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న హరీష్ శంకర్ ఆ తరువాత మళ్ళీ అలాంటి పర్ఫెక్ట్ హిట్ అందుకోలేదు. 2019 గద్దలకొండ గణేష్ తరువాత మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో భవదియుడు భగత్ సింగ్ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నప్పటికి ఆ ప్రాజెక్ట్ పవన్ బిజీ వలన స్టార్ట్ కాలేదు.

ఇక పవన్ ప్రాజెక్ట్ ఇప్పట్లో స్టార్ట్ కాకపోవచ్చు. ఇక హరీష్ మైత్రి మూవీ మేకర్స్ లోనే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు టాక్ వచ్చింది. అలాగే అదే సంస్థలో బాలకృష్ణ 109వ సినిమాను కూడా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక లైనప్ లో రామ్ పోతినేని పేరు కూడా వినిపించింది. డిస్కషన్ లు బాగానే జరుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కడం లేదు. మరి హరీష్ శంకర్ తదుపరి సినిమాను ఎప్పుడు ఎవరితో స్టార్ట్ చేస్తాడో చూడాలి.


Post a Comment

Previous Post Next Post