ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు మొత్తం చెప్పాడు: తేజ

 


ఉదయ్ కిరణ్ తో తేజ.. చిత్రం, నువ్వు నేను, కౌనన్నా కాదన్నా.. అనే సినిమాలను తెరపైకి తీసుకువచ్చాడు. ఇక తేజ పరిచయం చేసిన ఉదయ్ కిరణ్ కొన్నాళ్లు సక్సెస్ చూసి ఆ తర్వాత మళ్లీ ఒకసారిగా డౌన్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని మృతికి కల కారణం ఏమిటి అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడ్డాయి.


కానీ ఎవరు కూడా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఉదయ్ కిరణ్ మృతి పట్ల ఇటీవల మరోసారి దర్శకుడు తేజ స్పందించిన విధానం వైరల్ గా మారింది. ఉదయ్ కిరణ్ ఏం జరిగిందో మొత్తం చెప్పాడు అని అయితే అతని డెత్ మిస్టరీ గురించి అయితే ఇప్పుడే నేను చెప్పలేను అని సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని విషయాలు చెబుతాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ముఖ్యంగా నేను చచ్చేలోపు ఆ విషయం బయట పెడతానని అన్నాడు. మరి తేజ ఆ విషయం గురించి ఎప్పుడు బయటపెడతాడో చూడాలి. తేజ తదుపరి సినిమా అహింస త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ద్వారా రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

Post a Comment

Previous Post Next Post