సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఇండస్ట్రీలో దాదాపు సినీ ప్రముఖులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్నప్పుడే విదేశాల్లో ఉన్న పలువురు కుటుంబ సభ్యులు కూడా నిన్న ఉదయానికి హైదరాబాద్ చేరుకొని కృష్ణకి నివాళులర్పించారు. అయితే ఒక ఘట్టమనేని వారసుడికి మాత్రం కడసారి చూపు కూడా దక్కలేదు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు ఏకైక తనయుడు జయకృష్ణ కొన్ని నెలల క్రితమే అమెరికా వెళ్ళాడు. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ప్రత్యేకంగా అతను శిక్షణ తీసుకుంటున్నాడు. కృష్ణ గారే సొంత ఖర్చులతో మనవడ్ని అమెరికా పంపించారు. ఇక తాత మరణవార్త వినగానే అతను బయలు దేరి రావాలని అనుకున్నప్పటికి అతనికి కుదరలేదట. ఇక గత రాత్రి వచ్చిన జయకృష్ణ ఫ్యామిలీని చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఇక అతను త్వరలోనే మహేష్ బాబు చేతుల మీదుగా టాలీవుడ్ హీరోగా లాంచ్ కాబోతున్నాడు.
Follow
0 Comments