దిల్ రాజు తెగించేశారు!

సినిమా ఇండస్ట్రీలో కలిసి కట్టుగా ఉండడం అనేది ఎప్పటికి జరగదు. అలాగే ఇండస్ట్రీ ఏకధాటిగా ఓకే వేదికపైకి రావాలని చెప్పే మాటలు కూడా అబద్ధమే అని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో చెప్పారు. అయితే దిల్ రాజు మొదట్లో ఇండస్ట్రీ కోసం ఆలోచిస్తానని బాగానే చెప్పేవారు. కానీ ఇటీవల ఆయన ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఇక తాను ఇండస్ట్రీ పెద్దగా అందరి కోసం మాట్లాడను అని తెగించి చెప్పారు.


ఏదైనా సరే ఇక్కడ వ్యాపారం ముఖ్యం అని అలాగే మొదట్లో నలుగురు మనల్ని మాట్లాడమని చెబుతారు ఆ తరువాత వెనక్కి తిరిగి చూస్తే ఒక్కరు ఉండరని అన్నారు. సురేష్ బాబు అల్లు అరవింద్ వంటి వారికి గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడరు. దిల్ రాజు అనేవాడు ఒక బ్రాండ్ కాబట్టి ఫోకస్ అవుతున్నాడు కాబట్టి కామెంట్ చేస్తుంటారు. ఎవరి గురించి పట్టించుకోను. మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఆటోమేటిక్ గా సపోర్ట్ వస్తుంది. ఇటీవల వచ్చిన మసూద సినిమా అందుకు ఉదాహరణ. కంటెంట్ ఉన్న సినిమాను ఎవడు ఆపలేడు. నేను థియేటర్స్ దొరక్కుండా ఏమి చేయను. నా సినిమా బాగోలేకపోయినా థియేటర్ ఓనర్ మరో సినిమా వేసుకుంటాడు అని దిల్ రాజు తేల్చి చెప్పేశారు.

Post a Comment

Previous Post Next Post