రష్మిక.. మళ్ళీ నోరు జారింది!

రష్మిక మందన్న తెలిసి అంటుందో లేక తెలియక నోరు జరుతుందో గాని అనవసరంగా కొన్ని కామెంట్స్ చేసి కాంట్రవర్సీలో నిలుస్తోంది. ఇదివరకే కాంతర సినిమా చూడలేదని, రిషబ్ శెట్టి దర్శకత్వంలో చేసిన ఫస్ట్ సెలక్షన్  పై కూడా ఆమె ఊహించని విధంగా స్పందించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.


ఆమె ప్రస్తుతం తన కొత్త బాలీవుడ్ చిత్రం మిషన్ మజ్ను ప్రమోషన్‌లలో బిజీగా ఉంది. ఇక ఇది త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడుతుంది. అయితే రొమాంటిక్ సాంగ్స్ విషయంలో బాలీవుడ్ బెస్ట్ అని, చిన్నప్పటి నుంచి తనకు అవి ఇష్టమని రష్మిక ప్రమోషన్స్ లో చెప్పింది. అలాగే సౌత్ సినిమాలలో మాస్ మసాలా పాటలు, ఐటెం నంబర్లు, డ్యాన్స్ నంబర్లకు ప్రసిద్ధి చెందినవి అని చెప్పడంతో.. ఆమె ఉద్దేశపూర్వకంగా సౌత్ సినిమాని కించపరిచిందని నెటిజన్లు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. దానికి సంబంధించిన ఆమె వీడియో కూడా వైరల్‌గా మారింది.  మరి ఇది ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post