శర్వా పెళ్లి.. అమ్మాయి అతనికంటే రిచ్!


టాలీవుడ్ హీరో శర్వానంద్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇటీవల పెద్దలు చూసిన అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక వారికి పెళ్లికి సంబంధించిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శర్వానంద్ నిశ్చితార్థం జనవరి 26న జరగనుంది ఇక సమ్మర్‌లో పెళ్లి జరగనుంది.

వధువు ప్రస్తుతం యుఎస్‌లో ఐటి ప్రొఫెషనల్‌గా పనిచేస్తుందని, పెళ్లి కూడా కుదిరిందని చెబుతున్నారు. వధువు బొజ్జల కుటుంబానికి చెందినదని కథనాలు వచ్చాయి.  దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శాసనసభ్యుడిగా పనిచేశారు. 

వధువు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కూతురు పద్మ కూతురు.  వధువు మేనమామ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆ అమ్మాయి శర్వానంద్ ఫ్యామిలీ కంటే చాలా రిచ్ అని తెలుస్తోంది. ఇప్పుడున్న యువ హీరోల్లో శర్వానంద్ కూడా చాలా రిచెస్ట్ హీరో అని చెప్పవచ్చు. వారి తల్లిదండ్రుల నుంచే అతనికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ఇప్పుడు కాబోయే భార్య కూడా అంతకుమించి సంపన్నులు అని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post