గుంటూరు కారం.. థమన్ పారితోషకం ఎంతంటే?


మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా అప్డేట్స్ కంటే కూడా వివిధ రకాల కాంట్రవర్సీలతో ఎక్కువగా వైరల్ అవుతుంది. అసలు చిత్ర యూనిట్ లో ఏం జరుగుతోంది అనేది ఎవరికీ సరిగ్గా అర్థం కావడం లేదు. షూటింగ్ అయితే సగంలో సగం కూడా సరిగ్గా ఫినిష్ కాలేదు. ఇక 2024 సంక్రాంతి రిలీజ్ అంటున్నారు ఆ సమయానికి త్రివిక్రమ్ సినిమాను ఫిష్ చేస్తాడా లేదా అనేది ఆసక్తిగా మారింది. 

ఇక థమన్ ను తీసేస్తున్నారు అని పూజా హెగ్డే ఉండకపోవచ్చు అని కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే తమన్ విషయంలో మాత్రం ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అతనికి భారీ మొత్తంలో ముందుగానే పారితోషకం ఇచ్చారు. అంతకు ముందు వరకు ఏడు నుంచి ఎనిమిది కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్న థమన్ ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు మాత్రం ఏకంగా 10 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు మొదట థమన్ విషయంలో కాస్త అసంతృప్తిగానే ఉన్నప్పటికీ త్రివిక్రమ్ అతన్ని ఒప్పించాల్సి వచ్చింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి థమన్ ఈ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post