రాజమౌళి - ఆ టైమ్ దగ్గర పడింది!


దర్శకుడు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయేంద్రప్రసాద్ ఇచ్చిన క్లారిటీతో ఆ సినిమా తీసే టైం దగ్గరలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో చాలా బిజీగా ఉన్న రాజమౌళి ఆ తర్వాత వెంటనే మహాభారతం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

అయితే విజయేంద్ర ప్రసాద్ RRR సీక్వెల్ కూడా ఉంటుంది అనే ఒక హింట్ అయితే ఇచ్చారు. అయితే హాలీవుడ్ రేంజ్ లో ప్రజెంట్ చేయాలని ఆలోచనలో కూడా ఉన్నారట. కానీ దాన్ని రాజమౌళి డైరెక్ట్ చేయకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టును ఎవరైనా హాలీవుడ్ టీం తో కలిసి రాజమౌళి చర్చించే అవకాశం ఉందట. అంటే రాజమౌళి కూడా సినిమాను డైరెక్ట్ చేయకపోవచ్చు అని కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక మహేష్ బాబు సినిమా తర్వాత రాజమౌళి వీలైనంత తొందరగా మహాభారతం సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే 2026 తరువాత మహాభారతం సీరీస్ ఉంఫేవచ్చని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post