నమ్మకద్రోహం తగునా త్రివిక్రమ్?


గుణశేఖర్ బ్యాడ్ లక్ ఏమిటో గాని శకుంతలం సక్సెస్ అయి ఉంటే మాత్రం హిరణ్యకశిప తప్పకుండా గ్రాండ్ స్కేల్లో మొదలయ్యేది. ఐదేళ్ల క్రితం ఆయన ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకురావాలి అని ఎన్నో పురాణాలు తిరిగేసారు. సొంతంగా రచయితలను పెట్టుకుని మరి కథను సిద్ధం చేసుకున్నారు. అయితే రానా చేస్తానని వాగ్దానం ఇవ్వడంతో సురేష్ ప్రొడక్షన్స్ కూడా హాలీవుడ్ స్థాయిలో కనెక్షన్స్ సెట్ చేసి గుణశేఖర్ ని రంగంలోకి దింపింది. 

కానీ హాలీవుడ్ సంస్థలు మాత్రం గురశేఖర్ తో చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేదు. ఇక కరోనా రావడంతో ఆ చర్చలు మొదటికి వచ్చాయి. అయితే గుణశేఖర్ మాత్రం తప్పకుండా ప్రాజెక్టును మొదలుపెట్టాలని అనుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉన్న సమయంలోనే త్రివిక్రమ్ వచ్చి ఈ సినిమాకు నేను డైలాగ్స్ అందిస్తాను అని చెప్పినట్లు.. గుణశేఖర్ ఆ మధ్య ఇంటర్వ్యూలలో కూడా తెలియజేశాడు.

అయితే ఇప్పుడు సడన్ గా గుణశేఖర్ లేకుండానే హిరణ్యకశివ ప్రాజెక్టును కేవలం త్రివిక్రమ్ తోనే రానా తెరపైకి తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. ఆయన కేవలం స్క్రిప్ట్ రైటర్ గానే ఉంటాడట. కాకపోతే దర్శకుడు మాత్రం మరొకరు అని తెలుస్తోంది. మొత్తానికి ఫామ్ లో లేడని మాత్రం గుణశేఖర్ ను పక్కన పెట్టేశారు. అయితే ఈ విషయంలో గుణశేఖర్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యాడు.

ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు అనే విధంగా ఆయన ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్కటి గమనిస్తాడు అని కూడా ఇన్ డైరెక్ట్ గా ట్వీట్స్ లో అయితే తెలిపారు. ఇక త్రివిక్రమ్ రానా మాత్రం ఈ విషయంలో ఒకసారి గుణశేఖర్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఆయనకు ఒక మాట కూడా చెప్పకుండా స్వేచ్ఛగా ప్రాజెక్టును ఎనౌన్స్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. నిజానికి ఇలాంటి కథలు ఎవరైనా సరే వారికి నచ్చిన తరహాలోనే ప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ గుణశేఖర ఈ ప్రాజెక్టు ఐడియాను మొదట లేవనెత్తాడు. మరి ఆయన బాగున్నప్పుడు చర్చలు జరిపి ఫ్లాప్ రాగానే పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయమో వారే నిర్ణయించుకోవాలి.

Post a Comment

Previous Post Next Post