అనుష్క వల్లే.. దెబ్బ పడేలా ఉంది ?


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక కథానాయకుడు నవీన్ పోలిశెట్టి గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ అయితే చేస్తున్నాడు. సినిమాపై కొంతవరకు మంచి హైప్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకు అనుష్క నుంచి మాత్రం ఎలాంటి సపోర్ట్ అయితే లభించడం లేదు. 

ఆమె ఇంతవరకు సినిమా గురించి ఎక్కడ ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నా కూడా అనుష్క రాకపోతే మళ్ళీ బాగుండదు అని కూడా ఆ ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉందట. ప్రెస్ మీట్ ఇంటర్వ్యూలు ఈ సినిమాకు చాలా అవసరం. ఎందుకంటే మంచి బజ్ ఉన్న ఈ సినిమాకు అనుష్క ప్రమోషన్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ ఎక్కువగానే ఉంటాయి.

కానీ ఇప్పుడు ఆమె తన పర్సనల్ రీజన్స్ వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు. ఆ విషయంలో చాలా రకాల గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఇక అనుష్క ఆ గ్యాప్ లోని చాలా లావు అయినట్లు సమాచారం. అందుకే ఆమె బయటకు రావడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని టాక్. ఇక ఎఫ్ఎం రేడియో లాంటి ప్లాట్ ఫామ్ లో ఆమె కనిపించకుండా సినిమా గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా ఈ సినిమాకు అనుష్క ప్రమోషన్ చేయకుంటే ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post