యువ హీరో విశ్వక్ సేన్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే విశ్వక్ త్వరలోనే తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయడంతో అది పెళ్లికి సంబంధించిన న్యూస్ అయి ఉంటుంది అని ఆగస్టు 15వ రోజు అందుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాడు అని అందరూ చర్చించుకుంటున్నారు.
నిజానికి విశ్వక్సేన్ పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్త లేదు. ఇప్పట్లో అయితే అతను పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదట. అసలు మ్యాటర్ ఏమిటి అంటే విశ్వక్సేన్ ఓటీటీ ప్రపంచంలోకి ఒక సరికొత్త టాక్ షో ద్వారా తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. త్వరలోనే ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో మొదలు కాబోయే ఒక రియాలిటీ టీవీ షో కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికే విశ్వక్ ఈ విధంగా పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేగాని అదే పెళ్లికి సంబంధించిన న్యూస్ ఏమీ కాదు అని అతని సన్నిహితులు చెబుతున్నారు.
Follow
Post a Comment