చంద్రముఖి 2 ఈసారి VV పుష్పం.. ఎందుకు తీశారో..?


చంద్రముఖి 2 సినిమా నేడు తమిళ్ తెలుగులో ఒకేసారి విడుదల అయింది. ఈ సినిమా రజినీకాంత్ ఎందుకు చేయలేడు అనే సందేహం చాలా మందిలో కలిగింది. ఇక దానికి సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఆయన బిజీగా ఉండడం వలన ఈ సినిమా చేయలేదు అని కారణాలు చెప్పినప్పటికీ కంటెంట్ చూస్తే మాత్రం రజనీకాంత్ ఈ సినిమాకు దూరంగా ఉండటమే బెటర్ అని, ఆయన తెలివిగా తప్పించుకున్నట్లుగా అర్థమవుతుంది. 

దర్శకుడు పి వాసు కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న చిత్రం చంద్రముఖి. ఇది కూడా ఒక మలయాళం రీమేక్ అయినప్పటికీ కూడా తమిళ్ తెలుగులో అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా జ్యోతిక నటన రజనీకాంత్ స్టైల్ మేనరిజం అలాగే విద్యాసాగర్ ఇచ్చిన మ్యూజిక్,.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక మరచిపోలేని క్లాసిక్ గా అయితే చంద్రముఖిని నిలబెట్టాయి.

కానీ ఈసారి మాత్రం సీక్వెల్ ఏ మాత్రం సంతృప్తి పరచలేదు. అసలు ఈ సినిమాను ఎందుకు తీసారు అని ఆలోచన కూడా కలుగుతుంది.  ఒక ఫ్యామిలీ బంగ్లాలో దిగడం వారందరూ కూడా ఒక గుడికి వెళ్లడం ఆ గుడిలో పూజ చేయొద్దని చంద్రముఖి పగబట్టడం అనంతరం ఫ్లాష్ ప్యాక్, ఇక తర్వాత చంద్రముఖిని ఎప్పటిలానే VP ని చేసే కథను ముగించడం.

దర్శకుడు పీ. వాసు ఈ విధానంలో అసలు కొత్తదనాన్ని ఏమాత్రం ఫాలో కాలేదు. కాస్త నాగవల్లిని ఆమ్లెట్ లా తిప్పేసినట్లు అనిపిస్తుంది. ఇక కంగాన లాంటి మంచి నటి అసలు ఈ సినిమాలో స్పూఫ్ చేసిందా అనే భావన కూడా కలుగుతుంది. ఆమె క్యారెక్టర్ చివరలో అసలు మరి దారుణంగా ఉంది. చంద్రముఖిగా క్లారిటీగా చూపించే సమయంలో అసలు ఆమె ఇచ్చిన హావభావాలు అయితే చాలా కామెడీగా ఉంటుంది.

ఒకప్పుడు చంద్రముఖిగా జ్యోతిక ఇచ్చిన హావభావాలకు ఇప్పటికి త్రిల్లింగ్ అనిపిస్తుంది. కానీ కంగానా క్యారెక్టర్ లో అదే మిస్ అయింది. ఇక కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఎక్కడా కూడా ఆకట్టుకోలేదు. దానికి తోడు వారాయి పాటను రీమిక్స్ చేసి మరింత దారుణంగా ఫీలింగ్ ను చెడగొట్టేశారు. ఇక రాఘవ లారెన్స్ రజనీ పాత్రను ఇమిటెడ్ చేయబోయి మరింత విమర్శలను మూటగట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక వడివేలు కామెడీ కూడా పాత చింతపండు లాగానే ఉంది. 

కింగ్ పాత్రను దెయ్యంగా తీసుకు వచ్చి పాత చంద్రముఖిని కొత్తగా రంగులు వేసి చూపించాలని అనుకున్నారు దర్శకుడు వాసు. కానీ ఆ పాత్రకు చివరికి సరైన సమాధానం ఇవ్వకుండానే కథను ముగించారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా సెట్స్ చూస్తూనే అనిపిస్తుంది. కానీ క్యారెక్టర్స్ మాత్రం అందుకు తగ్గ అవుట్ ఫుట్ అయితే ఇవ్వలేదు. మొత్తానికి చంద్రముఖి 2 నీ డబ్బులు ఎక్కువై చేశారేమో అని భావన కూడా కలుగుతుంది.

Post a Comment

Previous Post Next Post