స్కంద మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
తెలంగాణ సీఎం రంజిత్ రెడ్డి (శరత్ లోహితాశ్వ) కుమారుడు ఆంధ్రప్రదేశ్ సీఎం రాయుడు (అజయ్ పుర్కర్) కుమార్తెతో పారిపోతాడు. ఇక ఆ కోపంతో, రాయుడు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఇంతలోనే భాస్కర్ రాజు (రామ్ పోతినేని) ఎంట్రీ ఇస్తాడు. అసలు ఈ భాస్కర్ రాజు ఎవరు?   ఇద్దరు సీఎంలను ఎందుకు టార్గెట్ చేశాడు?  రుద్రగంటి రామకృష్ణ రాజు (శ్రీకాంత్) రాజుకి వీరి మ్యాటర్ కు సంబంధం ఏంటి అనేది వెండితెరపై చూడాలి.

విశ్లేషణ:
రామ్ పోతినేని బోయపాటి తో సినిమా చేయబోతున్నాడు అనగానే తప్పకుండా మాస్ ఎలివేషన్స్ హై లెవెల్ లో ఉంటాయని ఆడియన్స్ లో ఒక నమ్మకం అయితే ఉంటుంది. కానీ బోయపాటి బాలయ్యను చూపించినంత హై రేంజ్ లో మాత్రం మిగతా హీరోలను అంత పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడు అనే ఒక కామెంట్ కూడా ఉంది. ఇక ఈసారి రామ్ ని ఎలా చూపిస్తాడా అని అందరూ అనుకున్నారు. అయితే అతని మాస్ క్యారెక్టర్ మాత్రం స్క్రీన్ పై చూసేటప్పుడు బాగానే అట్రాక్ట్ చేస్తాడు అనిపించింది. కథ మొదటి నుంచి కొనసాగుతున్న కొద్ది రామ్ నటించిన విధానం అతని డైలాగ్స్ పరవాలేదు అనే విధంగానే ఉన్నాయి.

 కానీ ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా తర్వాత మళ్లీ అదే యాస ను రామ్ కొనసాగిస్తూ ఉంటే ఎక్కడో కాస్త మరి ఓవర్గా ఉందే అనే అనిపించకుండా ఉండదు. స్కంద పాత్రలో రామ్ ఒకవైపు క్లాస్, మరొకవైపు ఊర మాస్ లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాలేజీ అబ్బాయిలా హీరోయిన్ ను ప్రేమలో పడేసే విధానం చాలా రొటీన్ గా ఉంది. హీరోయిన్ శ్రీలీల పాత్రలో అంత కొత్తదనం ఏమీ లేదు.

ఏదో ఆమెను లవ్ ట్రాక్ కోసమే తీసుకున్నట్లుగా ఉంది. ఇక బోయపాటి విలన్స్ ను అత్యంత పవర్ఫుల్ గా చూపించాలని ప్రయత్నం చేశాడు. కాలకేయ ప్రభాకర్ అలాగే శరత్ లోహితాశ్వ, అజయ్ పుర్కర్ ఎప్పటిలానే చాలా రెగ్యులర్ గానే కనిపిస్తారు. కానీ కొన్ని మాస్ ఎలివేషన్స్ సీన్స్ లో మాత్రం దర్శకుడు హీరోను ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. రామ్ పర్ఫెక్ట్ మేనరిజంతో కొన్ని సీన్స్ లో బాగానే పైలెట్ అయ్యాడు. కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం చాలా రొటీన్ గానే ఉంటుంది.

కథ మొదట్లోనే శ్రీకాంత్ చేసిన పాత్రకు హీరో పాత్రకు కనెక్షన్ ఉంటుంది అని ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇక దాని వెనకాల నుంచి ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోవడం కోసం దర్శకుడు చాలా రిస్క్ అయితే చేశాడు. మళ్ళీ హీరో మీదకు ఎక్కువగా ఫోకస్ వెళ్లడం వలన మిగతా క్యారెక్టర్ల బలం తగ్గిపోతుందేమో అనుకొని అరగంట పాటు హీరోని లేకుండా చేశారు. అది ఈ సినిమాకు మేజర్ మైనస్ అనే చెప్పాలి. 

పోనీ ఆ పాత్రలపై సింపతి పెరిగి ఆ తర్వాత హీరో ఎలివేషన్ తో విజిల్ వేసే విధంగా ఉంటుంది ఏమో అని ఊహించుకుంటే దర్శకుడు అక్కడ కూడా తన పాత కంటెంటే చూపించాడు. చాలా రొటీన్ గానే స్కంద ఫస్ట్ ఆఫ్ కొనసాగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో ఆలస్యం చేయకుండా వెంట వెంటనే హీరో విలన్సును చితకొట్టే కార్యక్రమాలను పెట్టించారు. ఇక బోయపాటి డైలాగ్స్ కూడా రెగ్యులర్ గానే ఉన్నాయి.

అయితే బాలయ్యకు సెట్ అయినట్లుగా అది ప్రతి హీరోకు మాత్రం సెట్ అవ్వదేమో అని అనిపిస్తూ ఉంటుంది. రామ్ ఐతే తన పాత్ర వరకు చాలా న్యాయం చేశాడు. సెకండ్ హాఫ్ లో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా మినిమం విజిల్ వేసే విధంగా ఉండేది. కానీ రొటీన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో చివరకు దర్శకుడు రెగ్యులర్ గానే కథను ముగించాడు. ఇక ప్రిన్స్, కాలకేయ ప్రభాకర్, గౌతమి, ఇంద్రజ లాంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు మరికొంతమంది నటీనటులు చాలా రెగ్యులర్ గానే కనిపించారు.

తమన్ బ్యాగ్రౌండ్ విషయంలో సౌండ్ పెంచాడు గాని అందులో కొత్తగా ఏమీ లేదు. ఇక కెమెరా పనితనం మాత్రం కొన్ని యాక్షన్ సీన్స్ లో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్ గా సినిమా అయితే బోయపాటి రేంజ్ కు తగ్గ మార్క్ అయితే ఇవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. రామ్ మాత్రం తన పాత్రకు బాగానే న్యాయం చేశాడు. కానీ కొత్తగా కంటెంట్ లేకపోవడం రోత ఎమోషన్స్ రొటీన్ ఫైట్స్ ఇలా సినిమాకు పెద్ద మైనస్ అయ్యాయి. మరి ఫైనల్ గా సినిమా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ను ఎంతవరకు అట్రాక్ చేస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉రామ్ నటన
👉కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:
👉రొటీన్ కథ
👉అతిగా కొన్ని హీరో సీన్స్
👉సంగీతం

రేటింగ్: 2.50/5

Post a Comment

Previous Post Next Post