ప్రభాస్ తో అంటే.. శ్రీలీల రెమ్యునరేషన్ డబుల్!


ప్రభాస్ తో సినిమా చేయాలి అని ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ చాలా బలంగానే కోరుకుంటున్నారు. వారి శక్తి మేరకు రికమండేషన్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు శ్రీలీలకు డిమాండ్ అయితే గట్టిగానే పెరిగింది. శ్రీలీలకు ప్రస్తుతం క్రేజ్ ఏ స్థాయిలో ఉంది అంటే ఖాళీ లేక డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని ఆఫర్స్ వదిలేసుకునేంత బిజీగా ఉంది.

అయితే ప్రభాస్ తో ఆమెకు ఇప్పుడు ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ఇక హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీలను ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడి పారితోషకం కూడా ఒక్కసారిగా డబుల్ అవుతుంది. ప్రస్తుతం రెండు కోట్లకు పైగానే తీసుకుంటున్న ఈ బ్యూటీ ప్రభాస్ తో ఫ్యాన్ ఇండియా సినిమా అంటే 5 కోట్లు తీసుకున్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post