మహేష్ తో ఇండస్ట్రీ హిట్ మిస్ చేసుకున్న కంగనా!


బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ కంగనా రనౌత్. ఈ అమ్మడు ప్రస్తుతం చంద్రముఖి 2తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. 

పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబింబేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పోకిరిలో ముందుగా కంగనా రనౌత్ నటించాల్సి ఉందంట. అయితే ఆ టైంలో వేరే కమిట్మెంట్స్ కారణంగా పోకిరి మూవీ ఛాన్స్ ని కంగనా రనౌత్ వదులుకుంది. అయితే పోకిరి మూవీ ఛాన్స్ వదులుకోవడంపై ఇప్పటికి ఫీల్ అవుతున్న అని కంగనా చెప్పుకొచ్చింది. 

ఈ సారి మాత్రం మంచి కథ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కంగనా రనౌత్ ప్రకటించింది. పాన్ ఇండియా సినిమాలతో తెలుగులో కూడా ఆమె సినిమాలకి ఆదరణ పెరిగింది. మణికర్ణిక మూవీ టాలీవుడ్ లో కూడా హిట్ అయ్యింది. ఇప్పుడు చేస్తోన్న చంద్రముఖి సక్సెస్ అయితే మాత్రం కంగనా రనౌత్ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 

Post a Comment

Previous Post Next Post