రాజమౌళి కంటే ముందు మహేష్ మరొకటి.. ఛాన్సే లేదు


సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కంటే ముందు మరొక సినిమా చేయబోతున్నాడు అంటూ గత రెండు మూడు రోజులుగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో అయితే దర్శకుడు అనిల్ రావిపూడి అని అలాగే నిర్మాత అనిల్ సుంకర అంటూ వివిధ రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.

ఇటీవల వరుసగా ఏజెంట్, భోళా శంకర్ లతో డిజాస్టర్ అందుకున్న అనిల్ సుంకర కోసం మహేష్ జెడ్ స్పీడులో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ అయితే వచ్చింది. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా విషయంలో చాలా ఆలస్యమైంది. రాజమౌళి అయితే ఈ ఏడాది చివరిలోకి మహేష్ ప్రాజెక్టును సంబంధించిన వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు అయితే జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అలాగే రాజమౌళి యూనిట్ అందరూ కలిసి బౌండ్ స్క్రిప్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఏడాదిలోపే అది ఫినిష్ అవుతుంది. ఇక రాజమౌళి కోసం మహేష్ కూడా ఫిట్నెస్ విషయంలో అలాగే లుక్ విషయంలో కూడా కాస్త మార్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ లోపు మరో సినిమా అంటే మళ్ళీ రాజమౌళి కి ఇబ్బంది అవుతుంది. అందుకే మహేష్ ఇప్పట్లో మరో సినిమా చేసే అవకాశం లేదని పక్కాగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post