100 కోట్ల ప్రాజెక్టును రిజెక్ట్ చేసిన నవీన్ పొలిశెట్టి


నవీన్ పోలిశెట్టి కథలను ఎంచుకునే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఆలస్యమైనా సరే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందించాలి అని అతను ఆలోచిస్తూ ఉంటాడు. నేటి తరం యువ హీరోలు ఇతన్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఏది పడితే అది తొందరపడి చేయకుండా మంచి కథలతో ఆడియన్స్ మెప్పు పొందాలి. ఇక రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అతను మరో సక్సెస్ అందుకున్నాడు. 

అయితే ఈ సినిమా కంటే ముందు నవీన్ పోలీస్ శెట్టి కి 100 కోట్ల బడ్జెట్ తో కూడిన ఒక ప్రాజెక్టులో ఆఫర్ కూడా వచ్చింది. కానీ అతను క్యారెక్టర్ అంతగా సెట్ అవ్వలేదు అని రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా మరేదో కాదు జిగర్తండా సీక్వెల్. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్తాండ తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో దాన్ని హరీష్ శంకర్ వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ గా తీసుకువచ్చాడు. కానీ తెలుగులో సినిమా అంతగా సక్సెస్ కాలేదు.

ఇక కార్తీక్ ఇప్పుడు జిగర్తండా డబుల్ ఎక్స్ అంటూ రాఘవ లారెన్స్ అలాగే ఎస్ జె. సూర్య ప్రధాన పాత్రలతో సీక్వెల్ ను తీసుకొస్తున్నాడు. అయితే అందులో సూర్య చేయాల్సిన పాత్ర కోసం మొదట నవీన్ ను అనుకున్నారు. కానీ అప్పుడు అతని డేట్స్ కుదరక సూర్య ను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అని దర్శకుడు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నిజానికి అయితే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండడం వల్లనే నవీన్ ఆ క్యారెక్టర్ ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post