హిట్టు కోసం భయపెట్టే సీక్వెల్ లో అఖిల్?


అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి కూడా అతను ప్రతి సినిమా తో ఏదో ఒక విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతని కష్టం వృధా అవుతోంది. ఇక ఏజెంట్ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ దెబ్బతో అఖిల్ కెరీర్ కూడా కాస్త కన్ఫ్యూజన్ లో పడింది. ఎలాంటి కంటెంట్ తో మళ్ళీ రావాలి అనే విషయంలో అతను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు.

అయితే ఈసారి సక్సెస్ అయిన ఒక హిట్టు సినిమాకు సీక్వెల్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాను డైరెక్టర్ చేసిన కార్తీక్ దండు ఇటీవల అఖిల్ అక్కినేని కలిసినట్లుగా తెలుస్తోంది. అతనికి ఒక హారర్ కాన్సెప్ట్ కథను కూడా వివరించినట్లు సమాచారం. అయితే అది విరూపాక్ష సీక్వెల్ అని కూడా ఒక రూమర్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది. ఈ విషయంలో త్వరలో ఒక క్లారిటీ అయితే రానుంది. మరోవైపు అఖిల్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తో కూడా చర్చలు జరుపుతున్నాడు. మరి ఈ ఇద్దరిలో అఖిల్ ఎవరి కథకు ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post