ప్రభాస్ బర్త్ డే సర్ ప్రైజ్.. ఇంతకంటే ఎక్కువ ఉండవు


ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తాయేమో అని ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ పుట్టినరోజుకు మాత్రం లైనప్ లో ఉన్న ప్రతీ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ మాత్రం ఉండకపోవచ్చు. ఏవి వచ్చిన రాకపోయినా మాత్రం రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం తప్పకుండా వస్తాయట. 

ఇక అందులో ముఖ్యంగా సలార్, కల్కి సినిమాల నుంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సలార్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే ఒకటి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ విషయంలో వెనక్కి తగ్గిన చిత్ర యూనిట్ ఒక టీజర్ రిలీజ్ చేస్తే అవకాశం ఉంది. ఇక కల్కి సినిమాకు సంబంధించిన స్పెషల్ బర్త్డే టీజర్ ఒకటి విడుదల చేయవచ్చు. ఇక లిస్టులో ఉన్న మారుతి సినిమా అప్డేట్ మాత్రం ఇప్పట్లో రాకపోవచ్చు. సలార్ సినిమా విడుదల అయిన తర్వాతనే ఈ సినిమా అప్డేట్స్ వస్తాయి. ఇక ప్రభాస్ హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా అఫీషియల్ అప్డేట్ కూడా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post