రామ్ చరణ్.. బుచ్చిబాబు కూడా అదే ఫార్ములా!


ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. స్క్రిప్ట్ పనులు మొత్తం కూడా ఫినిష్ అయ్యాయి. ఇక రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ముందస్తు ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ప్రత్యేకంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక ఆఫీస్ కూడా నిర్మించింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలు పెట్టబోతున్నారు. 

అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెర పైకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు 2 పార్ట్స్ ఫార్ములాను గట్టిగానే ఫాలో అవుతున్నాయి. ఈ ట్రెండ్ ఇప్పుడు సినిమా బిజినెస్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అనుకున్న కథను ఎలాంటి డౌట్స్ లేకుండా పర్ఫెక్ట్ గా రెండు భాగాలుగా చెప్పవచ్చు అని దర్శకులు ఆలోచిస్తున్నారు. ఇక బుచ్చిబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నారనీ ఒక టాక్ అయితే వైరల్ గా మారుతోంది. మరి ఇది ఇంతవరకు నిజమో తెలియాలి అంటే ప్రాజెక్టు మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post