లోకేష్ - ప్రభాస్.. ఎంత టైమ్ పట్టొచ్చు?


ప్రభాస్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ పై చాలా రోజులుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్గా దర్శకుడు ప్రభాస్ తో చేయబోతున్నట్లుగా ఒక హింట్ అయితే ఇవ్వడంతో ఫాన్స్ లో మంచి జోష్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వీరికి సంబంధించిన ఏఐ డిజైన్ ఇమేజెస్ కూడా వైరల్ గా మారుతున్నాయి. అంతా బాగానే ఉంది కానీ ఈ కాంబినేషన్ సెట్ కావడానికి చాలా సమయం పడుతుంది.

ఎందుకంటే ప్రస్తుతం దర్శకుడు లోకేష్ రజనీకాంత్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు 2025లో రావచ్చు. ఇక మరోవైపు ఖైదీ , విక్రమ్ సీక్వెల్స్ ఉంటాయని కూడా బలంగా చెబుతున్నాడు. కాబట్టి వాటికోసం మూడేళ్ల సమయం పడుతుంది. ఇక లిస్టులో రోలెక్స్ క్యారెక్టర్ తో మరో స్టోరీ డెవలప్ చేయాల్సి ఉంది. దానికి మరో రెండేళ్లు. ఇక మరోవైపు ప్రభాస్ కల్కి, మారుతి సినిమా ఇలా వరుసగా ప్రాజెక్టులకు పూర్తి చేయాల్సి ఉంది. అలాగే లైనప్ లో హను రాఘవపూడి కూడా ఉన్నాడు. ఇక వీటిలో అనుకున్నట్లు అన్ని సమయానికి రాకపోవచ్చు. వాయిదాలు షూటింగ్ ఆలస్యం ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి లోకేష్ కాంబినేషన్ ఫిక్స్ కావడానికి 2030 వరకు వేచి చూడాల్సిందే.

Post a Comment

Previous Post Next Post