సలార్ నైజం.. దిల్ రాజు వదిలేశాడా?


ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ కు వాయిదా పడడంతో బిజినెస్ విషయంలో కూడా చాలా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ముందుగా అడ్వాన్స్ ఇచ్చిన వారు కూడా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అనేలా కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే మరి కొందరు మాత్రం పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసమే కొన్ని ఏరియాలకు సంబంధించిన డీల్స్ కూడా క్లోజ్ చేసుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలకు సంబంధించిన రైట్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ఎవరు రైట్స్ సొంతం చేసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక పెద్ద సినిమాలు అంటే ముందుగా దిల్ రాజు పేరే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే సలార్ విషయంలో మాత్రం ఆయన వెనక్కి తగ్గినట్లుగా కలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం మైత్రి మూవీ మేకర్స్, హోంబెల్ ఫిలింస్ వారికి ఎక్కువ స్థాయిలో ఆఫర్ చేస్తున్నారు. ప్రభాస్ స్నేహితులు యూవీ క్రియేషన్స్ కూడా రైట్స్ కోసం గట్టిగమే ప్రయత్నం చేస్తుంది. ఇక తలుచుకుంటే నైజా హక్కులను దిల్ రాజు కొనుగోలు చేసేవారు. మరి ఆయన ఎందుకు వెనక్కి తగ్గారు అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post