శ్రీలీల పెళ్లి.. ఇదెక్కడి రూమర్ సామీ?


గ్లామర్ హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంటున్న వారిలో శ్రీ లీల కూడా ఉంది. ఈ బ్యూటీ ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ మంచి పారితోషికం కూడా అందుకుంటుంది. అయితే హఠాత్తుగా ఇప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా కెరియర్ ఒక రేంజ్ లో కొనసాగుతున్న సమయంలో ఈ తరహా పెళ్లి రూమ్స్ రావడం అనేది విడ్డూరం అనే చెప్పాలి.

అది కూడా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఆమె క్లోజ్ గా ఉంది అంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అందులో మాత్రం ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. శ్రీ లీల వయసు 22 ఏళ్లు మాత్రమే. డాక్టర్ చదువుతున్నప్పటికీ ఆమె సినిమాలపై ఇంట్రెస్ట్ తో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఎంతో ఇష్టంగా తన ప్యాషన్ ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఆమెపై ఈ విధంగా గాసిప్స్ రావడం అనేది చాలా దారుణం. అది కూడా మరోవైపు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మోక్షజ్ఞతో అంటూ ప్రచారాలు చేయడం మరింత నాన్సెన్స్ కాకపోతే మరేంటి అని నెటిజన్స్ కౌంటర్ ఇస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post