తమన్.. ఈ దసరాకు మూడు గండాలు..!


మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల కాలంలో మళ్ళీ రొటీన్ ట్యూన్స్ తో నిరాశ పరుస్తున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా స్కంద సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఆ విషయంలో బోయపాటి కూడా సంతృప్తిగా లేడని అనిపించింది. దానికి తోడు కాపీ క్యాట్ మరకలు కూడా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఈ దసరా మాత్రం థమన్ కు పరీక్ష ఎదురుకానుంది. ఏకంగా బడా హీరోల అభిమానులను మెప్పించాల్సిన అవసరమైతే ఉంది. 

భగవంథ్ కేసరి సినిమా దసరాకు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఇదే ఫెస్టివల్ కు గుంటూరు కారం మొదటి పాటను కూడా విడుదల చేయబోతున్నారు. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్ ను కూడా అప్పుడే విడుదల చేయలేని ఆలోచిస్తున్నారు. కాబట్టి తమన్ ఈ దసరాకు ముగ్గురు హీరోల అభిమానులను మెప్పించాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మళ్లీ ట్రోల్స్ బారిన పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా గేమ్ ఛేంజర్, గుంటూరు కారం సినిమాల పరిస్థితి విభిన్నంగా ఉంది. వాటిపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే బాధ్యత మొత్తం కూడా థమన్ పైనే ఉంది. మరి అతను ఎంతవరకు ఈ చాలెంజ్ లో న్యాయం చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post