లియో - చరణ్.. ఉన్నా లేకున్నా ప్లస్సే..!


రామ్ చరణ్  లియో సినిమాలో ఉన్నాడు అని మరొకవైపు అందులో నిజం లేదు అని వివిధ రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై  చిత్ర యూనిట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఒక విధంగా ఇది ఎంత వైరల్ అయితే అంత హెల్ప్ అవుతుంది అనే కారణం కూడా ఉండవచ్చు. సినిమా విడుదల తర్వాత దర్శకుడు లోకేష్ మల్టీవర్స్ పాయింట్ ను అందులో చూపిస్తాడా లేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ట్రైలర్ తో కొన్ని షాట్స్ అయితే ఇది లోకేష్ మల్టివర్స్ అనే ప్రశ్నలను లేవనెత్తింది. 

రామ్ చరణ్ పోస్టర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. కానీ అవి కేవలం ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ మాత్రమే. రామ్ చరణ్ ప్రస్తావన లియో లో ఉండదు అనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నా. విక్రమ్ సినిమా కథకు మాత్రం ఖచ్చితంగా దర్శకుడు లింక్స్ అయితే కలిపినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనాప్పటికీ ఇలాంటి గాసిప్స్ లియో సినిమాకు ఇప్పుడు ఆయుధంగా మారిపోయాయి. తెలుగులో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. కాని కాంటెంట్ మెప్పిస్తేనే ఈ గాసిప్ కు ఒక ఫలితం ఉంటుంది. చూడాలి మరి ఎంతవరకు కలిసివస్తుందో.

Post a Comment

Previous Post Next Post