అనిల్ రావిపూడి బాలీవుడ్ ఎంట్రీ.. ఆ రీమేక్ అవసరమా?


దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇప్పటివరకు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ ఎదుర్కోలేదు. ప్రతి సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత నిర్మాతలకు లాభాలను అందిస్తూనే ఉంది. దిల్ రాజుతో సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 సినిమాలు చేసిన అనిల్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఆయాణతోనే అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా రీమేక్ కథ అని తెలుస్తోంది. 

బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న F2 కథను బాలీవుడ్ జనాలకు నచ్చే విధంగా రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారట దిల్ రాజు. త్వరలోనే ఈ విషయంలో ఒక అధికారిక అప్డేట్ కూడా రాబోతోంది. నిజానికి F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో మంచి సక్సెస్ అందుకున్నప్పటికి ఆ తర్వాత మాత్రం ఇది రొటీన్ కామెడీ అనే కామెంట్స్ వచ్చాయి. ఇక దానికి ఫ్రాంచెస్ గా వచ్చిన F3 మాత్రం అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇంతకుముందు జెర్సీ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసి డిజాస్టర్ ను ఎదుర్కొన్న దిల్ రాజు ఇప్పుడు F2 లాంటి రోటీన్ కథను బాలీవుడ్ జనాలకు ఎక్కించాలని చూస్తున్నాడు. ఒక విధంగా ఇది రిస్క్ తో కూడుకున్న పని. మరి రాజు గారి ప్రయోగం కమర్షియల్ గా ఏదైనా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post