మెగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ళు ప్రేమించుకున్న వీరిద్దరూ బయట ప్రపంచానికి తెలియకుండానే తమ రిలేషన్ ని పెళ్లి వరకు తీసుకోచ్చేశారు. కొన్ని నెలల క్రితం ఎంగేజ్మెంట్ జరిగింది. తరువాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. ఇప్పుడు టైం దొరకడంతో పెళ్లిపీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. 

రీసెంట్ గా ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకోవాలని ముందుగా అనుకున్న ఏవో కారణాల వలన డెస్టినేషన్ వెడ్డింగ్ కి మొగ్గు చూపించారు. ఇప్పటికే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా వరుణ్, లావణ్య పెళ్లి దుస్తులని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కోసం వారం రోజులు ముందుగానే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ వెళ్ళబోతోంది. 

ఇటలీలోనే టస్కనీలో వెడ్డింగ్ వెన్యూ ఫిక్స్ చేశారు. నవంబర్ 1న వరుణ్, లావణ్య పెళ్లి వేడుక జరగనుంది. దానికి సంబందించిన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయి. పెళ్ళికి సంబందించిన సంబరాలు ముందుగానే ప్రారంభం కానున్న నేపథ్యంలో వారం రోజులు ముందుగా అక్కడికి మెగా ఫ్యామిలీ చేరుకుంటుంది. దీనికోసం అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ సినిమాలకి రెండు వారల బ్రేక్ ఇవ్వనున్నారు. 

అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ఈ రెండు వారాలు మెగా, అల్లు ఫ్యామిలీస్ రెండు కూడా పెళ్లి సంబరాలలో ఉంటారు. పెళ్లి అయిన తర్వాత మరల హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరి పెళ్లి టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండబోతోంది.

Post a Comment

Previous Post Next Post