మహేష్ రాజమౌళి.. ఇంకా అంతవరకు రాలేదు


డైరెక్టర్ రాజమౌళి పై మహేష్ బాబు సినిమా ఏ స్థాయిలో ఒత్తిడిని తీసుకొస్తుందో ఊహలకు అందని విధంగా ఉంది. తప్పకుండా సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని ముఖ్యంగా RRR  కంటే హై రేంజ్ లో ఉంటుంది అని ముందుగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు రచయిత విజయేంద్ర ప్రసాద్. దీంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్టు తదుపరి అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే రీసెంట్ గా రాజమౌళి పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసుకుని మహేష్ బాబును కలిసినట్లుగా కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇంకా రాజమౌళి స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ చేయలేదు. మొత్తంగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న తర్వాతనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఈ ఏడాదిలో అయితే ఈ సినిమా అప్డేట్ ఉండకపోవచ్చు. ఇక గుంటూరు కారం సినిమా విడుదలైన తరువాతనే వీరి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post