ఈ వారం సినిమాలు.. అదొక్కటే బెటర్!


అక్టోబర్ 6ను టార్గెట్ చేసుకొని కొన్ని చిన్న సినిమాలు గట్టిగానే హడావుడి చేశాయి. అయితే ఇందులో మంచి టాక్ అందుకున్న సినిమాలకు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో ఓపెనింగ్స్ అయితే రాలేదు. ఇక కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన మ్యాడ్ సినిమా పరవాలేదు అనిపిస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది రెండో రోజు నుంచి అర్థమవుతుంది.

ఇక సుధీర్ బాబు మాయా మశ్చీంద్రా సినిమాకు ఫస్ట్ డే జీరో షేర్స్ లభించినట్లుగా తెలుస్తోంది. ఇక కిరణ్ అబ్బవారం రూల్స్ రంజన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కలర్ స్వాతి మంత్ అఫ్ మధు కాస్త విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం కలెక్షన్స్ రావడం లేదు. ఇక సిద్ధార్థ నటించిన చిన్నా సినిమా మాత్రం మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాకు కూడా కలెక్షన్స్ పెద్దగా పెరగడం లేదు. కేవలం మ్యాడ్ సినిమా మాత్రమే మంచి టాక్ అందుకుంటూ డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే సినిమాకు ఇంకాస్త ప్రమోషన్స్ పెంచితే ఈ వీకెండ్తో పాటు దసరా వరకు ఎంతో కొంత కలెక్షన్స్ మరింత రాబట్టే అవకాశం ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post