మహేష్ బాబు కోసం జేమ్స్ బాండ్ ట్రైనర్!


సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏదైనా సినిమాలో అతను బాడీ బిల్డప్ చేసి చూపిస్తాడే మో అని అనుకున్నప్పటికీ అది మాత్రం సాధ్యపడడం లేదు. ఇక రాజమౌళి సినిమా లో కొత్తగా ఏదైనా ట్రై చేస్తాడేమో అని అనుమానాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి దాదాపు తన ప్రతి మాస్ హీరోను కూడా బాడీ బిల్డ్ చేయించి వెండి తెరపై హై వోల్టేజ్ లుక్స్ తో ప్రజెంట్ చేశాడు.

కాబట్టి మహేష్ తో కూడా అలాంటిది ఏమైనా చేస్తాడేమో అని అందరూ అనుకుంటున్నారు. ఇక రీసెంట్గా మహేష్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ ఫోటోలో మహేష్ కండలు తిరిగిన తన బాడీని చూపిస్తున్నాడు. దీని వెనుక ఒక జేమ్స్ బాండ్ ట్రైనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, 'జేమ్స్ బాండ్' స్టార్ డేనియల్ క్రెయిగ్ తప్ప మరెవరికీ శిక్షణ ఇవ్వని సైమన్ వాటర్సన్. మహేష్ తన ఫిట్‌నెస్ ప్రయాణం కోసం హాలీవుడ్‌కు చెందిన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ హీత్ మాథ్యూస్‌ను నియమించుకున్నాడు. ఈ థెరపిస్ట్ మహేష్ న్యూ ఫిట్నెస్ కోసం జేమ్స్ బాండ్ ట్రైనర్‌ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post