బోయపాటి, సూర్య కంటే ముందు.. ఆ ప్రాజెక్టు!


బోయపాటి శ్రీను సూర్యతో ఒక సినిమా చేయడానికి ప్రణాళికలు రచించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం సూర్య మాత్రం ఖాళీగా లేడు. ఒకవైపు బిగ్ బడ్జెట్ కంగువ మూవీ, మరొకవైపు లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ రెండు ప్రాజెక్టులతో ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే సమ్మర్ వరకు కూడా సూర్య చాలా బిజీగా కనిపించబోతున్నాడు.

అయితే బోయపాటి అప్పటివరకు ఎదురు చూడకుండా ఈ గ్యాప్ లోనే మరొక క్రేజీ ప్రాజెక్టును లైన్లోకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక బాగా కలిసి వచ్చిన బాలకృష్ణతోనే ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాడు. స్కంద సినిమాతో ప్లాప్ అందుకున్న బోయపాటి మళ్ళీ ఆ సినిమా సక్సెస్ అయితే వెంటనే సీక్వెల్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ సినిమా ఊహించిన విధంగా బెడిసి కొట్టింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ తోనే అఖండ సీక్వెల్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. బాలకృష్ణ భగవంత్ కేసరి తర్వాత బాబీ సినిమాతో బిజీ కానున్నాడు. ఇక అది చేస్తూనే బోయపాటితో అఖండ 2 చేయాలని ఆలోచిస్తున్నారు. చూడాలి మరి ఈ కాంబో నిజంగా సెట్టవుతుందో లేదో.

Post a Comment

Previous Post Next Post