సలార్.. ఫస్ట్ హాఫ్ 2.. సెకండ్ హాఫ్ 3!


ప్రభాస్ సలార్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో పెద్దగా హడావుడి క్రియేట్ చేయకపోయినా ఫ్యాన్స్ లో అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ ఫస్ట్ డే నే 150 కోట్లు దాటుతాయని చెప్పవచ్చు. ఇక అంతలా ఇంపాక్ట్ చూపించబోయే సలార్ లో యాక్షన్ సీన్స్ కు అంతకుమించి అనేలా ఉంటాయని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ లో రెండు ఫైట్స్ ఉంటాయట.

ఒకటి హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కాగా మరొకటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్. ఈ రెండు కూడా సినిమా సెకండ్ హాఫ్ పై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ఉంటాయని టాక్. ఇక సెకండ్ హాఫ్ లో మూడు ఫైట్స్ ఉన్నట్లు సమాచారం. ఇవి మూడు కూడా ఒకదానికి మించి మరొకటి ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఉండే యాక్షన్ లో ఎమోషనల్ టచ్ కూడా హై లెవెల్లో ఉంటుందట. విలన్స్ ను చూసి భయంతో వణికోపోయే స్నేహితుడికి దేవా ఇచ్చే ధైర్యం ఆ ఫైట్ ద్వారా హైలెట్ అవుతుందట. మరి సినిమాలో ఉండే 5 ఫైట్స్ నిజంగానే ఆడియెన్స్ అంచనాలను అందుకుంటాయో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post