స్పిరిట్.. మళ్ళీ ఈ సడన్ షాక్ ఏంటి?


ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా కోసం ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. యానిమల్ సినిమా సక్సెస్ కావడంతో స్పిరిట్ అంతకు మించి అనేలా ఉంటుంది అని ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు. అసలైతే ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులను త్వరలోనే స్టార్ట్ చేస్తాను అని కూడా సందీప్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ వైరల్ అవుతోంది.


సలార్ సినిమా విడుదలైన తర్వాత ప్రభాస్ కల్కిని త్వరగా పూర్తి చేయబోతున్నాడు. అలాగే మరోవైపు మారుతి సినిమా కూడా ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక హను రాఘవపూడి కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాతనే ప్రభాస్ వంగా తో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ప్రభాస్ బిజీగా ఉంటాడు కాబట్టే ఆ లోపు సందీప్ అనిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ను కంప్లీట్ చేసే అవకాశం ఉన్నట్లు కొత్త తరహా గా గాసిప్స్ అయితే వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Post a Comment

Previous Post Next Post